పవన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పేసారా.?

Published on Oct 24, 2020 12:11 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ హైప్ నమోదు చేసుకున్న ఈ చిత్రంతో పాటుగా ఎప్పుడు లేని పవన్ మరిన్ని ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పేసి ఆశ్చర్యపరిచారు. ఇక ఇదిలా ఉండగా పవన్ అధికారికంగా ఓకే చేసిన ప్రాజెక్టులతో పాటుగా ఓ కీలక ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారని గాసిప్స్ వినిపించాయి. ఆ చిత్రమే “అయ్యప్పనమ్ కోషియం” రీమేక్.

ఈ చిత్రం రీమేక్ లో పవన్ నటించనున్నారని ఆ మధ్య సినీ వర్గాల్లో విస్తృతంగా టాక్ వినిపించింది. అయితే ఇపుడు ఈ ప్రాజెక్ట్ పై మరింత స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. అలాగే ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఫిక్స్ అయ్యాడని టాక్. “అప్పట్లో ఒకడుండేవాడు” సినిమా ఫేమ్ సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని అలాగే పవన్ 40 నుంచి 50 రోజులు డేట్స్ ఇస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందో లేదో తెలియాలి అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :

More