మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా “పెద్ది” పట్ల అంచనాలు మరింత పెరుగుతూ వెళుతున్నాయి. అయితే సినిమా దాదాపు పూర్తి కావచ్చింది కానీ ఒక్క స్పెషల్ సాంగ్ వరకు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇదే దర్శకుడు బుచ్చిబాబు సానా ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది. అయితే ఇందు కోసం చాలా మంది హాట్ బ్యూటీల పేర్లు వినిపించాయి కానీ ఫ్రంట్ రన్నర్ లో మాత్రం పాపులర్ నటి మృణాల్ ఠాకూర్ పేరే ఉంది.
ఇక ఫైనల్ గా పెద్ది లో కనిపించే స్పెషల్ సాంగ్ బ్యూటీ ఎవరు అనేది మేకర్స్ లాక్ చేసేసినట్టు ఇప్పుడు తెలుస్తుంది. మరి అది ఎవరో కూడా మెజారిటీ ఫ్యాన్స్ కోరుకుంటున్న మృణాల్ ఠాకూర్ అనే ఇప్పుడు టాక్. మరికొంతమంది ఆయేషా ఖాన్ వైపు కూడా మొగ్గు చూపారు కానీ ఫైనల్ గా మృణాల్ నే ఖరారు అయ్యిందట. తాజాగా రామ్ చరణ్ మృణాల్ నటించిన డెకాయిట్ సినిమాపై కూడా పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ లో కూడా ఆశలు మరింత పెరిగాయి. సో ఈ క్రేజీ సాంగ్ పై అఫీషియల్ క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది.
