పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల మధ్య ఆఫ్ స్క్రీన్ లో మంచి సాన్నిహిత్యం వుంది. అయితే వీరిద్దరూ ఏనాడూ మీడియా ముందుకొచ్చి తమ తమ ఇష్టాన్ని బయటపరచలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం పవన్ స్నేహం త్రివిక్రమ్ కి ఇబ్బందిగా మారుతున్నట్టు తెలుస్తుంది.
వివరాలలోకి వెళ్తే సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో విడుదల వేడుకలో భాగంగా పవన్ నాకు చాలా కాలంగా తెలిసినా ఈ మధ్య ఎక్కువ ఇబ్బంది పెడతున్నాడని సమాచారం. తను అన్నదానికి మెలిక పెడుతూ మెగా ఈవెంట్ లలో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నారని జతకలిపాడు. అయితే మీ అభిమానాన్ని పవన్ కళ్యాణ్ దగ్గరకు తప్పకుండా చేరుస్తానని మాటిచ్చాడు


