“సలార్”లో ప్రభాస్ రెండు రోల్స్ లోనా..?

Published on Feb 4, 2021 3:01 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ పాన్ ఇండియన్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” అనే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రం తాలూకా షూట్ శరవేగంగా జరుపుకుంటుంది. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ షూట్ కు సంబంధించి ఆన్ లొకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలాగే షూటింగ్ మొదలు పెట్టిన రోజు నుంచి కూడా కొన్ని ఫోటోలు ప్రభాస్ లుక్స్ బయటకు వచ్చాయి. మరి ఇవన్నీ చూస్తుంటే ఈ చిత్రంలో ప్రభాస్ రెండు రోల్స్ లో కనిపిస్తాడా లేక రెండు విభిన్న షేడ్స్ లో కనిపిస్తాడా అన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే మేకర్స్ విడుదల చేసిన అనౌన్సమెంట్ పోస్టర్ లో కనిపించిన ప్రభాస్ లుక్ కు అలాగే ఇప్పుడు షూటింగ్ లో ఉన్న ప్రభాస్ లుక్ కు అసలు సంబంధమే లేదు.

అందులో ట్రిమ్మింగ్ అండ్ బుర్ర మీసాలతో ఒక నియంతలా దర్శనం ఇచ్చాడు. మరి ఇప్పుడేమో యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. సో ఈ చిత్రంలో ప్రభాస్ చేస్తుంది డ్యూయల్ రోల్సా లేక మరేమన్నానా అన్నది ప్రశ్నగా మారింది. మరి దీనిపై క్లారిటీ రావాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :