యంగ్ రెబల్ స్టార్ ప్లానింగ్ మారిందా..?

Published on Oct 28, 2020 7:02 am IST

ఇప్పుడు మన టాలీవుడ్ హీరో యంగ్ ప్రభాస్ మొత్తం మన దేశంలోనే మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోగా నిలిచాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ చేతిలో దాదాపు 1000 కోట్ల విలువ చేసే భారీ చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి “రాధే శ్యామ్” పూర్తి కావస్తుంది. ఎలాగో ఈ చిత్రం పూర్తి కావస్తున్నా నేపథ్యంలో ప్రభాస్ ఓకే చేసేసాడు.

అయితే సమయంలో నాగశ్విన్ మరియు ఓం రౌత్ సినిమాలను ముగించేయ్యాలని అనుకున్నారని అప్పుడు టాక్ వినిపించింది. రెండు చిత్రాలకు సంబంధించిన షూట్ లో ఏక కాలంలో పాల్గొంటూ ముగించాలని ప్లాన్ చేసినట్టుగా టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ప్రకారం ప్రభాస్ ప్లానింగ్ మారిందట.

ఇప్పుడు రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ మొదటి ప్రిఫరెన్స్ “ఆదిపురుష్” అన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత తక్కువ గ్యాప్ లోనే నాగశ్విన్ ప్రాజెక్ట్ మొదలు అవుతుందని పరిస్థితులు అందుకే అనుకూలంగా ఉన్నాయని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ మొదటగా ఏ చిత్రాన్ని మొదలు పెడతారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More