అర్జున్ రెడ్డి డైరెక్టర్ కి ప్రభాస్ ఫిక్స్ అయ్యాడా?

Published on Feb 19, 2020 1:06 am IST

దర్శకుడు సందీప్ రెడ్డి రెండు వరుస బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించారు. విజయ్ దేవరకొండ హీరోగా ఆయన చేసిన మొదటి చిత్రం అర్జున్ రెడ్డి సంచలన విజయం సాధించింది. ఈ మూవీ హీరో విజయ్ ని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. ఇక ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేయగా అక్కడ కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక సందీప్ రెడ్డి తదుపరి చిత్రంపై అన్ని వర్గాల ప్రేక్షకులలో ఆసక్తి నెలకొనివుంది. ఐతే ఆయన నెక్స్ట్ మూవీపై అనేక పుకార్లు రాగా తాజా సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి ప్రభాస్ తో మూవీ సెట్ చేశారట.

హిందీ, తెలుగు భాషలలో బైలింగ్వల్ గా రానున్న ఈ మూవీ టైటిల్ కూడా డెవిల్ అనుకుంటున్నారట. ఇదే కథను రన్బీర్ కపూర్ తో సందీప్ చేయాలని చూశారు. ఐతే ఆయన విముఖత వ్యక్తం చేయడంతో ఈ కథను ప్రభాస్ కి వినిపించగా ఆయన ఆసక్తి కనబరిచారని తెలుస్తుంది. రాధా కృష్ణ తో ఆయన చేస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామా షూటింగ్ అనంతరం సందీప్ రెడ్డితో సినిమా చేస్తారట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :