ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం స్పిరిట్ కోసం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో రీసెంట్ గా బయటకు వచ్చిన కొన్ని విషయాలు ఒక ఫ్యాన్స్ లోనే కాకుండా సినీ వర్గాల్లో కూడా మంచి హాట్ టాపిక్ గా మారాయి. మొదటి నుంచి ఈ చిత్రాన్ని అభిమానులు వేరే లెవెల్ లో హైట్ పెట్టుకొని చాలా ఎక్కువ ఆశించారు.
కానీ ఇటీవల వచ్చిన కొన్ని క్లారిటీలతో అభిమానులు అంచనాలు కొంచెం తక్కువగా పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రభాస్, సందీప్ గా కాంబినేషన్ కోసం నెలకొన్న హైపొకటైతే వీరు కలయికలో తెరకెక్కుతున్న సినిమాతో నేపథ్య విషయంలో కూడా మంచి హైప్ సెట్ చేసుకున్నారు. కానీ ఇది కేవలం హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లోనే అని చెప్పడంతో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. సో ఇలా స్పిరిట్ విషయంలో పూర్తిగా అంచనాలు అయితే తగ్గలేదు. కానీ కొంచెం ఎక్కువ హోప్స్ పెట్టుకున్న ఫాన్స్ మాత్రం ఒకింత నిరాశ చెందారనే చెప్పాలి.
