రచయితగా మారనున్న సూపర్ స్టార్?

Published on Sep 26, 2020 3:02 pm IST

టాక్ తో సంబంధం లేకుండా ఎక్కడైనా సరే బాక్సాఫీస్ మోత మోగించగల అతి తక్కువమంది స్టార్ హీరోలలో తమిళ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ కూడా ఒకరు. అయితే ఇపుడు రజినీకు ఒక సాలిడ్ కం బ్యాక్ హిట్ అవసరం ఉంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో తీసిన “దర్బార్” అంతంత మాత్రమే ఆకట్టుకోవడంతో ఇప్పుడు అన్ని అంచనాలు అక్కడి మరో స్టార్ దర్శకుడు శివతో తీస్తున్న “అన్నాత్తే”పై నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

పరిస్థితులు కనుక బాగుండి ఉన్నట్టయతే ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఖచ్చితంగా నిలిచి ఉండేది. అయితే ఇపుడు లేటెస్ట్ గా ఈ చిత్రంపై పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో రజిని తన డైలాగ్స్ ను తానే రాసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి అది కేవలం తన సీన్స్ కు మాత్రమేనా సినిమా మొత్తానికీనా అన్నదానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే రజినీ తనకి తాను అందించుకునే డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం :

More