ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన బిగ్ సక్సెస్ పెద్ది హిట్ తర్వాత నెక్స్ట్ సినిమా కోసం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్ కలయికలో చేసిన ఈ సినిమా గ్రాండ్ గా మొదలు కానుంది. ఇక మరోపక్క తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆ మధ్య అవైటెడ్ సీక్వెల్ సినిమా ఓజి పార్ట్ 2 పై వరుస అప్డేట్స్ ఇచ్చి ఊరించారు.
అయితే ఇంట్రెస్టింగ్ గా బాబాయ్, అబ్బాయ్ ల ఇద్దరి సినిమాలు ఈ ఏడాది ఒకే నెల నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఓజి 2 దాదాపు నవంబర్ నుంచే మొదలు కానుంది అనే టాక్ ముందు నుంచీ ఉంది. ఇక ఇదే నెలలో మాసివ్ ప్రాజెక్ట్ రామ్ చరణ్, సుకుమార్ ల సినిమా షూట్ కూడా మొదలు కానుంది అన్నట్టు తెలుస్తుంది.
మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక పవన్ సినిమాని తన నిర్మాణ సంస్థ లోనే నిర్మాణం వహించనుండగా చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.


