మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు నటించిన తన కెరీర్ 16వ సినిమా “పెద్ది”తో భారీ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన కెరీర్ 17వ సినిమా తన దర్శకుడు సుకుమార్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ సుకుమార్ తో రంగస్థలం అనే సాలిడ్ ట్రాక్ రికార్డు ఆల్రెడీ ఉన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మళ్ళీ కలయికలో వస్తున్న సినిమా కావడంతో భారీ హైప్ దీనిపై సెట్ అయ్యింది.
అయితే రామ్ చరణ్ లుక్ విషయంలో ఇంట్రెస్టింగ్ గా మారింది. పెద్ది కోసం సిద్ధం చేసిన అదే లాంగ్ హెయిర్ లుక్ లోనే ఇంకా కొనసాగుతూ కనిపిస్తున్నాడు. మామూలుగా మన స్టార్స్ తమ లాంగ్ అవైటెడ్ సినిమాల కోసం ప్రిపేర్ చేసిన లుక్స్ ఆయా సినిమాలు పూర్తి చేసిన వెంటనే మార్చేస్తారు. కానీ ఇప్పటికీ చరణ్ అదే లాంగ్ హెయిర్ లుక్ లో కనిపిస్తుండడం గమనార్షం. దీనితో ఆ సినిమాకి కూడా ఇదే లుక్ లో తాను కొనసాగుతాడా లేదా అనేది చూడాలి.


