‘రామాయణ’ లీక్స్.. సాయి పల్లవిపై నెగిటివ్ కామెంట్స్

‘రామాయణ’ లీక్స్.. సాయి పల్లవిపై నెగిటివ్ కామెంట్స్

Published on Mar 9, 2026 10:09 AM IST

ramayana

ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న వరల్డ్ క్లాస్ చిత్రాల్లో రణబీర్ కపూర్ అలాగే సాయి పల్లవి జంటగా దర్శకుడు నితీష్ తివారి తెరకెకెక్కిస్తున్న భారీ చిత్రం “రామాయణ” కూడా ఒకటి. ఈ సినిమాకు రణబీర్, సాయి పల్లవిలు సీతారాముల పాత్రల్లో కనిపించనున్న సంగతి అందరికీ తెలిసిందే. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ పిక్ వైరల్ గా మారింది. ఇందులో సాయి పల్లవి రణబీర్ పక్కన కనిపిస్తుండగా ఆమె సీత పాత్రకి అస్సలు సెట్ కాలేదు అంటూ మరోసారి సోషల్ మీడియాలో గట్టిగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఈ ఏఐ ప్రపంచంలో ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోడానికి కొంచెం టైం పడుతుంది. అలానే ఈ సర్క్యులేట్ అవుతున్న ఫోటో ఏఐ ఫోటో అంటూ మరో వెర్షన్ వినిపిస్తుంది. సో ఆ లీక్ అయ్యిన ఫొటోలో నిజం లేదు అనుకోవచ్చు. ఇక ఈ భారీ సినిమాకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్, అలాగే ఏ ఆర్ రెహమాన్ లు సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ ఏడాది దీపావళి కానుకగా మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదలకి తీసుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు