వందల మిలియన్స్ లేవు.. ‘రామాయణ’ ట్రైలర్ కి ఇది జెన్యూన్ రెస్పాన్స్ లేక వీక్ రెస్పాన్స్?

వందల మిలియన్స్ లేవు.. ‘రామాయణ’ ట్రైలర్ కి ఇది జెన్యూన్ రెస్పాన్స్ లేక వీక్ రెస్పాన్స్?

Published on Aug 1, 2026 9:03 AM IST

Ramayana Movie Telugu Trailer

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న అవైటెడ్ విజువల్ ట్రీట్ వండర్ సినిమానే రామాయణ. సాయి పల్లవి, సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ లాంటి అగ్ర తారాగణంతో వస్తున్న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే లేటెస్ట్ గా వచ్చిన అవైటెడ్ ట్రైలర్ కి వీక్షకుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీనితో మేకర్స్ కి కూడా దీనితో ముందు గ్లింప్స్ రెస్పాన్స్ తో పోలిస్తే కొంచెం రిలీఫ్ అని చెప్పవచ్చు.

కానీ ఈ ట్రైలర్ కి మాత్రం మన ఇండియన్ ఇతర భారీ సినిమాలుకి వచ్చినట్టు వందల మిలియన్ వ్యూస్ రాలేదు. ఆదిపురుష్ ట్రైలర్ కే మొదటి 24 గంటల్లో ఒక్క హిందీలోనే 70 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. కానీ ఈ ట్రైలర్ కి మాత్రం అలాంటివి ఏమి లేవు. సింపుల్ గా అతి తక్కువే కనిపిస్తున్నాయి. సో మేకర్స్ జెన్యూన్ రెస్పాన్స్ వదిలేసారా లేక నిజంగా తక్కువ వ్యూస్ వచ్చాయా అనేది ఫ్యాన్స్ లో కూడా డిస్కషన్ గా మారింది. ఇక ముందు వచ్చే కంటెంట్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు