సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ డేట్ లాక్!?

సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ డేట్ లాక్!?

Published on May 9, 2026 8:55 PM IST

Vishwanath

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు చిత్రాల్లో టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరితో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ కూడా ఒకటి. దీనిపై మంచి బజ్ మొదటి నుంచీ ఉంది. ఆ మధ్యనే వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ కూడా ఆకట్టుకోగా ఈ సినిమా కోసం తెలుగు సహా తమిళ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా విడుదల ఎపుడు ఏంటి అనేది మాత్రం మేకర్స్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ సినిమా విడుదలపై లేటెస్ట్ బజ్ ఒకటి ఇప్పుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ ఆగష్టు నెల స్వాతంత్ర దినం హాలిడే రేస్ లో ఈ సినిమా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా టాక్.

సో ఈ చిత్రం ఆగష్టు 14న విడుదల అయితే సాలిడ్ వీకెండ్ దక్కినట్టే అని చెప్పొచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ అలాగే శ్రీకర సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు