“వకీల్ సాబ్” ట్రైలర్ రన్ టైం లాక్ అయ్యిందా.?

Published on Mar 25, 2021 7:04 am IST

ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారీ చిత్రం “వకీల్ సాబ్” విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కం బ్యాక్ చిత్రం నుంచి నిన్ననే ట్రైలర్ విడుదల పై బిగ్ అప్డేట్ వదిలారు. దీనితో ఈ ట్రైలర్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

మరి ఇదిలా ఉండగా మేకర్స్ ఎంత నిడివి గల ట్రైలర్ ను కట్ చేశారో అన్నది తెలుస్తుంది. వచ్చే మార్చ్ 29న విడుదల చేయబోయే ట్రైలర్ ను రెండు నిమిషాల 4 సెకండ్లకు కట్ చేశారట. ఇందులో కూడా పవన్ పై ఫుల్ మాస్ మసాలా సీన్స్ తో పాటుగా మెయిన్ కోర్ లైన్ ను చూపించనున్నారు. ఇక ఇదిలా ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా నివేత్త థామస్ మరియు అంజలి లు కీలక పాత్రల్లో నటించారు. అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :