“సలార్” రిలీజ్ ట్రైలర్ వాయిదా?

“సలార్” రిలీజ్ ట్రైలర్ వాయిదా?

Published on Dec 17, 2023 5:20 PM IST

Salaar 9

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం రిలీజ్ కి ఇపుడు సమయం దగ్గర పడుతుండగా మేకర్స్ కూడా పెద్దగా కంగారు లేకుండా అప్డేట్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు.

అయితే ఈ క్రమంలో సినిమా నుంచి అవైటెడ్ రెండో ట్రైలర్ ఇంకా రావాల్సి ఉంది. అది ఈరోజు వస్తుంది అని ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఇపుడు చివరి నిమిషంలో అయితే ఈ ట్రైలర్ ని మేకర్స్ వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ అవైటెడ్ ట్రైలర్ బహుశా రేపు విడుదల చేసే ఛాన్స్ ఉందని కూడా వినిపిస్తుంది.

ఈ ట్రైలర్ కోసం మాత్రం ఫ్యాన్స్ చాలా రోజులు నుంచి ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ కి రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు