టాలీవుడ్ క్వీన్ సమంత ట్వీట్ లు మరోసారి సంచలనం అయ్యాయి. సమంత సోషల్ మీడియాలో ఎవరిని ఉద్దేశ్యించి ఆ వ్యాఖలు చేయకపోయినా ఓ వర్గం ప్రేక్షకులు తమను టార్గెట్ చేసిందని.. చాలా తెలివిగా అలా ట్వీట్ చేసిందని అంటున్నారు.
ప్రస్తుతం సమంత నటించిన సినిమాలు రిలీజ్ కి దగ్గరగా లేకపోవడంతో సోషల్ మీడియాలో ఎక్కువగా కనబడడం లేదు. అయితే హఠాత్తుగా ‘బూమరాంగ్ లు చాలా ప్రత్యేకమైనవి, మనం వాటిని ఎంత బలంగా విసిరితే అంతే వేగంగా తిరి వచ్చి మనకు తగులుతాయి.. ‘ అంటూ ట్వీట్ చేసింది. వీటిపై రచ్చ మొదలైంది. సమంత ఎవరిని టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేసింది అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.
గతంలో సమంత చేసిన ట్వీట్లు… ట్విట్టర్ లో హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో కొందరు అభిమానులు ఆమె తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.



