సమంత నెక్స్ట్ హీరో అతనేనట..!

Published on Feb 22, 2020 5:26 pm IST

సమంత తాజాగా జాను చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. జయాపజయాలు ఎలా ఉన్నా..ఆ చిత్రంలో సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక సమంత ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యారు. దర్శకుడు అశ్విన్ శరవణన్ తెరెకెక్కించనున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నయనతార నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం సమంత మరో తమిళ ప్రాజెక్ట్ ని ఒకే చేశారట.

ఇక స్నేహ భర్త హీరో ప్రసన్న సరసన ఓ మూవీలో హీరోయిన్ గా సమంత నటిస్తుందట. ఈ చిత్రానికి కూడా అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తారట. దీనిపై అధికారిక ప్రకటన కొద్దిరోజులలో వెలువడే అవకాశం కలదు. అశ్విన్ తాప్సి ప్రధాన పాత్రలో తెరకెక్కిన గేమ్ ఓవర్ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :

X
More