“సర్కారు వారి పాట” ప్లాన్ మారిందా.?

Published on Apr 4, 2021 9:50 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న పక్కా కమెర్షియల్ చిత్రం “సర్కారు వారి పాట”. వరుస భారీ హిట్స్ తో హ్యాట్రిక్ నమోదు చేసుకున్న మహేష్ ఈ చిత్రంతో మరో హ్యాట్రిక్ జైత్ర యాత్రకు సన్నద్ధం అవుతున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం తాలుకా షూట్ కొన్నాళ్ల కితమే దుబాయ్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ నుంచి ఇక్కడి వచ్చాక మళ్ళీ కోవిడ్ ప్రభావం పెరగడంతో ఒక్కసారిగా మళ్ళీ ప్లాన్స్ మారాయి. అందులో భాగంగానే ఆల్రెడీ గోవాలో ప్లాన్ చేసిన షూట్ క్యాన్సిల్ చేశారట.

అలాగే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం మేకర్స్ హైదరాబద్ లోనే కొన్ని రోజులు పాటు షూట్ చెయ్యనున్నారని తెలుస్తుంది. ఈ నెల మధ్యలో నుంచి నిర్విరామంగా 25 రోజులు పాటు ఉంటుందని తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సాలిడ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :