“సర్కారు వారి పాట” టీమ్ ప్లానింగ్ ఇలా ఉందా?

Published on Sep 26, 2020 7:01 am IST

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంతో మహేష్ తన హ్యాట్రిక్ జైత్ర యాత్రను కొనసాగించాలని బలంగా ఫిక్స్ అయ్యి ఉన్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇపుడు మొదలు కానున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మేకర్స్ యూఎస్ లో లొకేషన్స్ వేటలో పడ్డారు.

అంతా సెట్టయ్యాక ఈ చిత్రం నవంబర్ నెలలో షూట్ మొదలు కానుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని శరవేగంగా కంప్లీట్ చెయ్యాలని భావిస్తున్నారట. షూట్ మొదలు కాబడిన ఈ రెండు మూడు నెలలోనే సగానికి పైగా షూట్ ను కంప్లీట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. మరి ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More