ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇటీవలే షూట్ ను మొదలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ లో మొదలు పెట్టిన మొదటి సాలిడ్ షెడ్యూల్ నే శరవేగంగా మంచి అవుట్ పుట్ తో తెరకెక్కించారు.
అయితే రెండో షెడ్యూల్ విషయానికి వస్తే ఇంకా ఎలాంటి అప్డేట్ ఇంకా తెలియరాలేదు. దీనికి కారణం కోవిడ్ వలనే అన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ రెండో షెడ్యూల్ కి ఒక ప్లాన్ ఉన్నప్పటికీ మేకర్స్ మార్చే యోచనలో ఉన్నారట. అయితే ఇప్పుడు చూస్తే తెలుగులో దాదాపు అందరి స్టార్ హీరోల సినిమాలు కూడా ఆన్ సెట్స్ లో శరవేగంగా షూట్ ను జరుపుకుంటున్నాయి.
కానీ ఇంకా ఈ చిత్రం నుంచే ఎలాంటి క్లారిటీ కానీ అప్డేట్ కానీ చాలా రోజుల నుంచి రాలేదు.. దీనితో మిగతా సినిమాలతో చూస్తే ఒక్క సర్కారు వారి పాటకు మాత్రమే బ్రేక్ వచ్చినట్టు ఉందని చెప్పాలి. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.


