శర్వానంద్ రెమ్యునరేషన్ గొడవ.. నిజమేనా ?

Published on May 29, 2021 3:00 am IST

హీరో శర్వానంద్ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. బయట విషయాల్లో పెద్దగా తలదూర్చరు. తన సినిమా రిలీజ్ టైంలో తప్ప ఎక్కడా పెద్దగా కనబడరు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వివాదంలో ఉన్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అది కూడ నిర్మాతలతో అంటున్నారు. విషయంలోకి వెళ్తే.. శర్వానంద్ చివరి చిత్రం ‘శ్రీకారం’. సినిమాకు మంచి పేరు అయితే వచ్చింది కానీ బాక్సాఫీస్ పరంగా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక మాటలో చెప్పాలంటే సినిమా లాస్ అనే అనాలి. ఈ చిత్రం విషయంలోనే 14 రీల్స్ నిర్మాతలకు, శర్వాకు చెడిందని టాక్.

ఈ సినిమాకు గాను ఇస్తామన్న రెమ్యునరేషన్లో 14 రీల్స్ నిర్మాతకు కొద్దిగా బాకీ పెట్టారని, శర్వానంద్ కదిలిస్తున్నా నిర్మాతల వైపు నుండి ఎలాంటి స్పందన లేదని అందుకే శర్వానంద్ వారికి లీగల్ నోటీసులు పంపారని అంటున్నారు. 14 రీల్స్ నిర్మాతల మీద గతంలో ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు లేవు. పెద్ద హీరోలతో పెద్ద సినిమాలు చేసిన ట్రాక్ రికార్డ్ వారిది. మరి ఈ వివాదంలో ఎంత నిజముందో తెలియాలంటే శర్వానంద్ లేదా 14 రీల్స్ నుండి క్లారిటీ రావాల్సిందే. ఇకపోతే 14 రీల్స్ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తుండగా శర్వానంద్ ‘మహాసముద్రం’తో పాటు ఇంకో బైలింగ్వల్ సినిమా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :