రీసెంట్ గా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన “గుడ్ బ్యాడ్ అగ్లీ” కూడా ఒకటి. అయితే ఈ చిత్రంలో అజిత్ ఎలాంటి డూప్ లేకుండా సినిమా స్టంట్స్ అన్నీ తానే చేశారు. మరి ఇదే తనకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తెచ్చి పెట్టింది. అజిత్ తన సినిమాల్లో రిస్క్ తో కూడుకున్న స్టంట్స్, రేసింగ్ సీక్వెన్స్ లు గాని ఇతర యాక్షన్ ఎపిసోడ్స్ ని స్వయంగా చేస్తారు.
కొన్నిసార్లు దెబ్బలు తిన్నా కూడా మళ్ళీ పర్ఫెక్ట్ గా చేసే వరకు వదలరు. మరి అజిత్ ప్రొఫిషినల్ రేసర్ కూడా అని అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులు నుంచి తాను ఓ రేసింగ్ లో పాల్గొనగా మొన్నామధ్య పెద్ద ప్రమాదానికే తాను లోనయ్యారు. అయితే దాని నుంచి చాలా సేఫ్ గా బయటకొచ్చిన థలా ఇపుడు షాకింగ్ గా మళ్ళీ రేస్ ట్రాక్ పైనే ప్రమాదానికి గురయ్యారు. ఈసారి కూడా కార్ ప్రాక్టీస్ లో వర్షపు నీరు ఉన్న ట్రాక్ మీద అదుపు ఢీ కొట్టింది.
అయినప్పటికీ అజిత్ సేఫ్ గా తిరిగొచ్చారు అని తెలుస్తుంది. కానీ మరో వెర్షన్ కూడా దీనికి వినిపిస్తుంది. అది అజిత్ కాదు అని అజిత్ తో ఉండే మరో డ్రైవర్ అంటూ మరో వెర్షన్ కూడా ఉంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో టీం నుంచే క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.