తన రెమ్యునరేషన్ పెంచేసిన సూర్య..?

Published on Nov 22, 2020 2:00 pm IST

తెలుగు మరియు తమిళ సినీ ఇండస్ట్రీలలో మోస్ట్ లవబుల్ టాప్ హీరోస్ లో సూర్య కూడా ఒకరు. మంచి మార్కెట్ ఉన్న సూర్య ఒక సాలిడ్ కం బ్యాక్ ఇస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకున్నారు. కానీ ఆ కం బ్యాక్ అయితే వచ్చింది కానీ దానిని థియేటర్స్ లో మిస్సయినందుకు చాలా నిరాశ పడ్డారు.

అయితే సూర్య చేసిన ఈ లేటెస్ట్ చిత్రం “ఆకాశం నీ హద్దురా” డిజిటల్ గ్రాండ్ హిట్ అనంతరం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై కూడా దృష్టి పెట్టేసారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం సూర్యా తన రెమ్యునరేషన్ కు కాస్త పెంచినట్టే తెలుస్తుంది.

గతంలో తాను ఫ్లాపుల్లో ఉన్న సమయంలో సూర్య రెమ్యునరేషన్ తక్కువ గానే తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఒక హిట్ రావడంతో తన ఆర్ధిక పరిస్థితుల రీత్యా కూడా ఆలోచించి రెమ్యునరేషన్ ను పెంచినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సూర్య రెండు సినిమాలను కమిట్ అయ్యారు.

సంబంధిత సమాచారం :

More