వినాయక చవితికి సప్రైజ్ ఇవ్వనున్న తారక్ ?

వినాయక చవితికి సప్రైజ్ ఇవ్వనున్న తారక్ ?

Published on Aug 24, 2018 10:00 AM IST

Aravindha Sametha

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్లో శరవేగంగా జరుగుతుంది. ఇక ఇటీవల విడుదలైన చిత్ర టీజర్ అభిమానుల అంచనాలు అందుకొని మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. మరో సారి వారికీ వినాయక చవితి రోజు సప్రైజ్ ఇవ్వనున్నారు చిత్ర టీం.

ఈచిత్రం యొక్క రెండవ టీజర్ సెప్టెంబర్ 13న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. యాక్షన్సన్నివేశాలతో కూడుకున్న మొదటి టీజర్ కంటే ఈ టీజర్ బిన్నంగా వుండనుందట. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది.

త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో జగపతి బాబు, నాగ బాబు , రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈచిత్రం దసరా కానుకగా విడుదల కానుంది.

తాజా వార్తలు