‘శ్రీనివాస కళ్యాణం’ కథ అదేనా ?
Published on Jul 26, 2018 10:44 pm IST


నితిన్ హీరోగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. కాగా ఈ చిత్రం విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఐతే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రకథ ఇదేనంటూ ఓ ఆసక్తికరమైన పాయింట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. విషయంలోకి వెళ్తే సంపన్న కుటుంబాల్లో పుట్టి పెరిగిన హీరోహీరోయిన్లు పేమించుకుంటారు, కానీ వారికి పెళ్లి మీద సరైన అభిప్రాయం ఉండదట. దాంతో ఎప్పుడన్నా గొడవలు వస్తే విడిపోవచ్చు అనే అగ్రిమెంట్ మీద ఇద్దరూ కట్టుబడి ఉంటారు.

దాంతో విషయం తెలుసుకున్న వారి పెద్దవాళ్ళు, పెళ్లి మీద హీరో హీరోయిన్లకు ఉన్న అభిప్రాయాన్ని పొగడటానికి పెళ్లి విశిష్టతను చాటి చెప్పేలా వారి జరిపించి, వారికి కనువింపు కలిగిస్తారట. ఈ చిత్రం మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా రాశీఖన్నా, నందిత శ్వేతలు కథానాయకిలుగా నటిస్తున్నారు. పూర్తి స్థాయి రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమా పై నితిన్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. మరి నితిన్ ఆశించినట్లు ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook