ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశించడం జరిగింది. అందులో ఒకరు ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి కాగా మరొకరు యాంకర్ శిల్పా చక్రవర్తి. ఐతే ఈ ఇద్దరు అంచనాలు అందుకోవడంలో విఫలం చెందారు. తమన్నా సింహాద్రి కఠిన పదజాలం వాడటం మరియు ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆమె త్వరగానే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఆ తరువాత కొంచెం అంచనాల మధ్య వైల్డ్ కార్డు ఇచ్చిన శిల్పా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు.
శిల్పా ఇంటి సభ్యులెవ్వరితో సఖ్యతగా మెలగకపోవడం, ఒక్కరే ఒంటరిగా గడపడానికి ఇష్టపడటం వంటి చర్యల ద్వారా ఎలిమినేషన్ కి గురై ఇంటిని వీడడం జరిగింది. కాగా షో ని రసవత్తరంగా మార్చడానికి బిగ్ బాస్ నిర్వాహకులు మరో వైల్డ్ కార్డు ఎంట్రీని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. తెలుగులో ప్రముఖ మేల్ యాంకర్స్ లో ఒకరైన రవిని హౌస్ లోకి పంపాలని భావిస్తున్నారట. మరి దీనిపై ఇంకా ఎటువంటి స్పష్టత లేకున్నప్పటికీ కొన్ని మాధ్యమాలలో ప్రముఖంగా వినిపిస్తుంది.


