“ఆదిపురుష్” నుంచి ఆ భారీ అనౌన్సమెంట్ రానుందా.?

Published on Jun 24, 2021 11:59 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రస్తుత భారీ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరామునిగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సీతగా మరో స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రలో నటిస్తున్నారు.

అయితే ఈ చిత్రం నుంచి ఇది వరకే అప్ టు డేట్ అప్డేట్స్ ను మేకర్స్ వదులుతూ వచ్చారు. మరి ఇలా రామాయణంలో ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ వస్తున్న మేకర్స్ నుంచి మరో భారీ అనౌన్సమెంట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రామాయణంలో మరో పవర్ ఫుల్ పాత్ర అయినటువంటి హనుమంతుని రోల్ పైనే ఆ అప్డేట్ ఉండొచ్చేమో అని బజ్ వినిపిస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజమో అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :