కోవిడ్ ఎఫెక్ట్..ఈ భారీ చిత్రంపై కూడా వెనక్కి.?

Published on Apr 16, 2021 5:00 pm IST

ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్న కరోనా ప్రభావంతో మళ్ళీ మన ఇండియన్ సినిమా దగ్గర సినిమాలు వాయిదా పడటం స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే మన తెలుగులో కూడా అనేక సినిమాలు ఆల్రెడీ వాయిదా పడి సరైన సమయం కోసం ఎదురు చూడడం మొదలయ్యింది. అయితే ఇదే క్రమంలో పలు బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమాలు కూడా వాయిదా పడే సూచనలు ఉన్నాయని గాసిప్స్ కూడా మొదలయ్యాయి.

మరి అలా ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” వాయిదా పడేలా ఉందని ఊహాగానాలు మొదలవుతున్నాయి. మరి దీనిలో ఎంత వరకు నిజముందో చూడాలి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ గా నటించగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం :