బాలయ్య నెక్స్ట్ కి ఈ హీరోయిన్ ఫిక్స్.?

Published on Jun 23, 2021 8:20 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో “అఖండ” అనే సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనెర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం కూడా బాలయ్య సెట్ చేసిన లైనప్ పై మరింత హైప్ కూడా నెలకొంది. అలా మరో టాలెంటెడ్ అండ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ ను ఓకే చేశారు.

అలాగే ఇటీవలే కూడా అధికారికంగా అనౌన్స్ కాబడిన ఈ చిత్రంపై ఇపుడు లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ ఫిక్స్ అయ్యినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో వేచి చూడాలి. అలాగే ఈ చిత్రానికి కూడా థమన్ నే సంగీతం అందిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ బాలయ్య మరియు గోపీచంద్ తో మొట్ట మొదటి సారి వర్క్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :