దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పుడు సెన్సేషనల్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో “వారణాసి” అనే పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది పెద్ద సస్పెన్స్ నే. కానీ రాజమౌళి నెక్స్ట్ సినిమాని ఎవరితో చేస్తారు ఏ ప్రాజెక్ట్ అనే విషయానికి వస్తే ఆ సినిమా ఏదో కాదు మహాభారతమే అన్నట్టు వినిపిస్తుంది. దీనితో వారణాసి నెక్స్ట్ రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ నే అనుకోవాలి.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది రివీల్ కావాల్సి ఉంది. ఆల్రెడీ ఈ సినిమాని తాను పది భాగాలుగా తీస్తానని తెలిపారు. మరి 10 పార్ట్ లు రాజమౌళి స్పీడ్ లో కంప్లీట్ చెయ్యాలంటే ఎంత సమయం పడుతుంది అనేది కూడా అందరికీ తెలిసిందే. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తే అవన్నీ కంప్లీట్ అయ్యేందుకు ఇంకో 15 ఏళ్ళు అయినా మినిమమ్ పట్టొచ్చు కాబోలు. అది కూడా వారణాసి సినిమా తర్వాతే.. మధ్యలో RRR 2 కూడా ఉండొచ్చు. మరి ఇవన్నీ ఎప్పుడుకి సెట్ అవుతాయో చూడాలి మరి.
