“పుష్ప” లో ఈ సీన్ పక్కానా..?

Published on Aug 14, 2020 9:05 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న బన్నీ పాన్ ఇండియన్ ఎంట్రీ ఎట్టకేలకు “పుష్ప” చిత్రంతో నెరవేరనుంది. బన్నీ హ్యాట్రిక్ కాంబో సుకుమార్ తో తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఏక కాలంలో ఐదు భాషల్లో విడుదల కానుంది. అయితే ఇప్పటికే బన్నీకు నార్త్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ కూడా ఉంది. దీనితో సుకుమార్ అక్కడి ప్రేక్షకులు బన్నీ నుంచి ఏయే అంశాలు ఆశిస్తున్నారో వాటిని కూడా జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వినిపించింది.

అయితే ఈ చిత్రంలో ముఖ్యంగా బన్నీ లుక్స్ కోసం మాట్లాడుకోవాలి ఫస్ట్ లుక్ తోనే మంచి హైప్ తెచ్చిన బన్నీ ఈ సినిమాలో చేస్తున్న రోల్ కోసం చాలా బరువు తగ్గాల్సి వచ్చింది. దీనితో బన్నీ ఈ చిత్రంలో మరో సారి సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. ఇదిలా ఉండగా ఈ మధ్యన బయటకొచ్చిన బన్నీ లుక్స్ గమనిస్తే అది నిజమేనేమో అనిపించక మానదు.

లేటెస్ట్ గా మెగా డాటర్ నిహారిక నిశ్చయ వేడుకల్లో హాజరైన బన్నీను చూస్తే ఈ సరికొత్త ఫిట్నెస్ లుక్ స్టన్నింగ్ గా ఉంది. మరి ఇవన్నీ చూస్తూనే తన పాన్ ఇండియన్ ఎంట్రీ కోసం బన్నీ గట్టిగానే ప్లాన్ చేశారేమో అని చెప్పాలి. మరి ఇప్పుడు వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం సుకుమార్ నిజంగానే సిక్స్ ప్యాక్ సీన్స్ ఏమన్నా ప్లాన్ చేశారా లేదా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :

More