టాలీవుడ్ లో పక్కా స్క్రిప్ట్, ప్లానింగ్‌తో వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి, ఇప్పుడు ‘సంక్రాంతి 2027’ లక్ష్యంగా తన నెక్స్ట్ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మల్టీస్టారర్ చిత్రం జూన్ 18న గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.
జూన్ 22 నుండి షూటింగ్ ప్రారంభించి, అక్టోబర్ లేదా నవంబర్ నాటికల్లా పూర్తి చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తుండగా, వెంకటేష్ జూలై నుండి విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొననున్నాడు.
సాహు గారపాటి నిర్మాణంలో రానున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ ఇప్పటికే మూడు ట్యూన్స్ సిద్ధం చేశాడట. ఇక ఈ చిత్రానికి ‘జనవరి 13 విడుదల’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో మరోసారి అనిల్ రావిపూడి తన స్పెషాలిటీ నిరూపించుకుంటున్నాడు.


