టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బిగ్ స్క్రీన్ పై ఎంతపెద్ద స్టార్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చిరంజీవి నుంచి ఎప్పుడో ఓటిటి ఎంట్రీ కూడా పడాల్సి ఉంది కానీ చాలా ఆలస్యం అయ్యింది. కానీ ఫైనల్ గా వరల్డ్ పాపులర్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో మెగాస్టార్ మెగావర్స్ అంటూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఓ క్రేజీ టాక్ షోగా ప్లాన్ చేసిన ఈ షో ఆల్రెడీ పలు ఎపిసోడ్స్ షూట్ కూడా జరుపుకుంది.
ఇక ఈ షో ఎప్పుడు నుంచి స్ట్రీమింగ్ అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి మొదటి ఎపిసోడ్ మొన్న దీపావళి కానుకగా రావాల్సి ఉందని టాక్ ఉంది. కానీ ఫైనల్ గా ఇప్పుడు కొత్త సమయం లాక్ అయినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం డిసెంబర్ రెండో వారాంతంలో మెగావర్స్ మొదటి ఎపిసోడ్ స్ట్రీమ్ అవుతుంది అని తెలుస్తుంది. సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.


