బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవికి హీరోయిన్ గా కన్నడ రాకింగ్ స్టార్ యష్ విలన్ పాత్రలో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘రామాయణ’. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ విజువల్ ట్రీట్ ఆల్రెడీ 1000 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి సంచలనం నమోదు చేసింది.
అయితే ఈ సినిమా ఇప్పుడు రెండో వారాంతంలోకి వస్తూనే ఇండియా వైడ్ కేవలం హిందీ వెర్షన్ లోనే ఈ సినిమా నేటితో 500 కోట్లు క్రాస్ చేయనుంది. ఇక ఈ వారాంతం మరోసారి భారీ జంప్ ని ఈ సినిమా అందుకోవడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఒక్క హిందీలోనే కాకుండా దక్షిణాది భాషల్లో రామాయణ మంచి జంప్ అందుకునే ఛాన్స్ ఉంది.
వీటితో రామాయణ ఒక్క ఇండియా నుంచే 150 కోట్ల మేర గ్రాస్ అందుకున్నా పెద్ద ఆశ్చర్యం పడాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాకి హన్స్ జిమ్మర్, రెహ్మాన్ లు సంగీతం అందించారు. అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణం వహించారు.


