ఇండియన్ సినిమా దగ్గర ఇప్పుడిప్పుడే సూపర్ హీరో జానర్ సినిమాలు ఊపందుకుంటున్నాయి. కానీ ఎప్పుడో సూపర్ హీరోగా వచ్చి అప్పట్లోనే పాన్ ఇండియా ఆడియెన్స్ ని అలరించిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది హృతిక్ రోషన్ నటించిన క్రిష్ అనే చెప్పాలి. ఈ సినిమా కూడా అప్పట్లో పిల్లల్లో ఎంతో ప్రభావం చూపింది.
ఆ తర్వాత క్రిష్ 3 వచ్చింది కానీ ఇది వచ్చి దాదాపు దశాబ్దం అవుతుంది కానీ ఇప్పటికీ పార్ట్ 4(Krrish 4) కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా భాద్యతలు హృతిక్ రోషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇంకా ఈ సినిమా ఎంతకీ ముందుకు వెళ్తున్న సూచనలు కనపడడం లేదు. అయితే ఈ ఆలస్యానికి కారణం బడ్జెట్ సమస్యలే అట.
ముందు అనుకున్న బడ్జెట్ కి మించి ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది అని అందుకే ఇంకా ఈ సినిమా పట్టాలెక్కలేదు అని వినిపిస్తుంది. కానీ మంచి క్రేజ్ ఉన్న ఈ సినిమా కేవలం బడ్జెట్ సమస్యలతో వెనక్కి వెళుతుందా అంటే అది ఒకింత నమ్మేలా కూడా లేదు. మరి ఈ క్రేజీ సూపర్ హీరో సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
