నారప్ప డైరెక్ట్ ఓటిటి పై ఇంకా రాని క్లారిటీ!

Published on Jun 29, 2021 12:07 pm IST

అసురన్ చిత్రం రీమేక్ అయిన నారప్ప చిత్రం టాలీవుడ్ లో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ చిత్రం విడుదల విషయం లో ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో వచ్చే నెల 24 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీని పై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రం కోసం విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం లో వెంకటేష్ సరసన హీరోయిన్ గా ప్రియమణి నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం లో మురళి శర్మ, సంపత్ రాజ్, ప్రకాశ్ రాజ్, రావ్ రమేష్, రాజీవ్ కనకాల, కార్తీక్ రత్నం లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే థియేటర్ల లో విడుదల కావాల్సి ఉండగా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మరి దీని పై చిత్ర యూనిట్ త్వరలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :