మన టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా తెలుగు సినిమాగా చేసిన లేటెస్ట్ చిత్రమే “ఫంకీ” (Funky). యువ దర్శకుడు అనుదీప్ కేవీ తెరకెక్కించిన ఈ ఫన్ డ్రామా ఊహించని రీతిలో బజ్ ని అందుకోలేదు అలానే వసూళ్ళని కూడా అందుకోవడం లేదు. దీనితో ఇక ఈ సినిమా ఓటిటిలో కూడా కొంచెం ముందే వచ్చేసే సూచనలు ఉన్నట్టు ఇప్పుడు వినిపిస్తుంది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పటిలానే నెల రోజుల వ్యవధిలో రావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు మూడు వారాల్లోనే వచ్చేస్తుంది అన్నట్టు ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తుంది. దీనితో ఈ మార్చ్ మొదటి వారంలోనే ఫంకీ (Funky) ఓటిటిలో దర్శనం ఇచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదట. సో దీనిపై అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.
