ఎనెర్జిటిక్ హీరో, యాక్షన్ హీరోల మధ్య క్లాష్

Published on Jun 23, 2019 3:36 pm IST

ఎనర్జిటిక్ హీరో రామ్ “ఇస్మార్ట్ శంకర్” యాక్షన్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ “రాక్షసుడు” మూవీల మధ్య క్లాష్ తప్పేలా లేదు. ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలను ఒకే రోజు విడుదల చేయడమే దీనికి కారణం. ‘ఇస్మార్ట్ శంకర్’ అలాగే ‘రాక్షసుడు’ జులై 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో ఈ ఇద్దరు యంగ్ హీరో ల సినిమాల మధ్య పోటీ నెలకొననుంది.

దర్శకుడు పూరి తెరకెక్కిస్తున్న “ఇస్మార్ట్ శంకర్” పక్కా మాస్ మూవీగా తెరకెక్కుతుండగా, “రాక్షసుడు” మూవీని దర్శకుడు రమేష్ వర్మ క్రైమ్ థ్రిల్లర్ గా నిర్మిస్తున్నారు. రెండు చిత్రాలు భిన్నమైన నేపధ్యం కలిగిన చిత్రాలు కావడంతో వీటి మధ్య పోటీ అంతగా ఉంకపోవచ్చు. ఏదిఏమైనా ఈ రెండు చిత్రాల పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్న నేపథ్యంలో ఏచిత్రం విజయం సాధింది విన్నర్ గా నిలుస్తుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

More