‘ఇస్మార్ట్ శంకర్’కి వరల్డ్ కప్ హీట్, పూరి షాకింగ్ నిర్ణయం.

Published on Jun 22, 2019 3:30 pm IST

ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కతున్న మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. ఇప్పటివే విడుదలైన టీజర్, మణిశర్మ సంగీతం అందించిన ప్రోమో సాంగ్స్ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల మాల్దీవ్ లో రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసిన చిత్ర యూనిట్ మిగిలిన పాటలను హైదరాబాద్ లో చిత్రీకరించనున్నారని సమాచారం.

ఐతే ఇస్మార్ట్ శంకర్ విడుదల తేదీని నిర్మాతలు జులై 12నుండి 18కి మార్చినట్లు చిత్ర యూనిట్ ఓ ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన జులై 12వ తేదీన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనునున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఛార్మి,పూరి సంయుక్తంగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీలో రామ్ సరసన నిధి అగర్వాల్,నభా నటేష్ నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More