ఫైట్ చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ !

ఫైట్ చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ !

Published on Feb 9, 2019 2:10 AM IST

Ram

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగా ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈషెడ్యూల్ ఈనెల 22 వరకు జరుగనుంది. నిధి అగర్వాల్, నాబా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు చెప్పనున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రం మే లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు