ఇస్మార్ట్ శంకర్ లాభాల లెక్క ఎంతంటే…!

Published on Aug 22, 2019 7:10 am IST

హీరో రామ్, పూరీ జనన్నాథ్ కాంబినేషన్ లో ఇటీవల విడుదలైన చిత్రం ఇస్మార్ట్ శంకర్‌. రామ్ పోతినేని సరసన ఈ చిత్రంలో నభా నటేశ్ మరియు నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా జూలై 18న విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం అందుకుంది.

తాజాగా ఈ మూవీ రన్ బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తి కావడంతో లాభాల లెక్కలు చూడగా మతిపోయే ఫిగర్స్ బయటికొచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 34.55 కోట్ల షేర్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ చిత్ర థియరిటికల్ హక్కులు కేవలం 17కోట్లకు అమ్ముడు కావడంతో రెండింతల లాభాలు వచ్చినట్లైంది.

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా, నటి ఛార్మి నిర్మాతగా వ్యవహరించడం జరిగింది.

సంబంధిత సమాచారం :