200 మిలియన్ క్లబ్ లో “ఇస్మార్ట్ శంకర్”.!

Published on May 31, 2021 11:05 am IST


ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ లు హీరోయిన్స్ గా నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. దర్శకుడు పూరి జగన్నాథ్, రామ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ లకు కూడా బిగ్గెస్ట్ కం బ్యాక్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డబుల్ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అయితే ఈ చిత్రం మన తెలుగులో ఏ స్థాయి రెస్పాన్స్ ను కొల్లగొట్టిందో ఆ స్థాయిలోనే హిందీ డబ్ వెర్షన్ కు కూడా అనేక ఫాస్టెస్ట్ భారీ రికార్డులు సెట్ చేసి ఇపుడు మరో సెన్సేషనల్ మైల్ స్టోన్ ను టచ్ చేసింది. ఈ చిత్రం తాజాగా 200 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టి మరో భారీ రికార్డు సెట్ చేసింది.

ఇది వరకే రామ్ కెరీర్ లో మూడు సినిమాలు 200 మిలియన్ మార్క్ ను అందుకున్నాయి. దీనితో ఈ లిస్ట్ లో నాలుగో సినిమా చేరింది. దీనితో ఇప్పుడు రామ్ ఫ్యాన్స్ ఈ 2 కోట్ల వ్యూస్ తో ఇండియన్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :