ఎట్టకేలకూ ‘ఇస్మార్ట్ శంకర్’ ముగించాడు !

ఎట్టకేలకూ ‘ఇస్మార్ట్ శంకర్’ ముగించాడు !

Published on Jul 2, 2019 12:29 PM IST

హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనెర్ ‘ఇస్మార్ట్ శంకర్’. కాగా ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 18న గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు.

ఇక మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన నాలుగు పాట‌ల‌కు ఇప్పటికే అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాలో రామ్‌ సరికొత్త లుక్‌ లో కనపింబోతున్నారు. సినిమా పై భారీ అంచ‌నాలున్నాయి. రాజ్ తోట ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. రీసెంట్‌ గా విడుద‌లైన టీజ‌ర్‌ కు, దిమాక్ ఖ‌రాబ్ అనే సాంగ్‌ కు ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు