మాల్దీవ్స్ లో పాటల చిత్రీకరణ పూర్తి చేసుకున్న “ఇస్మార్ట్ శంకర్”

Published on Jun 17, 2019 7:40 pm IST

రామ్, పూరి జగన్నాద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ “ఇస్మార్ట్ శంకర్”. నిధి అగర్వాల్,నాభా నటేష్ లు రామ్ కి జంటగా నటిస్తున్నారు. ఇటీవలే పాటల చిత్రీకరణ కొరకు మాల్దీవ్స్ వెళ్లిన చిత్రం బృదం, రెండు పాటల చిత్రీకరణ పూర్తి కావడంతో తిరిగి హైదరాబాద్ కి ప్రయాణమయ్యారు. ఈ విషయాన్ని నిర్మాత ఛార్మి స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రెండు పాటల చిత్రీకరణ విజయవంతంగా మాల్దీవ్స్ లో పూర్తి చేశాం, మిగిలిన రెండు పాటలు హైదరాబాద్ లో చిత్రీకరించనున్నాం అని తెలిపారు.

ఛార్మి ఇస్మార్ట్ శంకర్ మూవీని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రోమో సాంగ్స్,టీజర్ కి ప్రేక్షకులనుండి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీకి సంగీతం ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More