రామ్ – నిధి అగర్వాల్, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనెర్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. దర్శకుడు పూరి జగన్నాథ్ ఎలాగైనా ఈ సారి ఓ భారీ హిట్ కొట్టాలనే కసితో ఈ సినిమా చేశాడు. మరి పూరి అనుకున్నట్లు హిట్ కొడతాడా ? లేక ఎప్పటిలాగే ఏవ్ అరుపులతో అవే బూతులతో బాక్సాఫీస్ వద్ద మరో ప్లాప్ ను మూటకట్టుకుంటాడా.. అయితే ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ లో మాస్ ఆడియన్స్ ను పూరి బాగానే ఆకట్టుకున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’లో పూరి తన పెన్ పవర్ చూపించబోతున్నాడట. మొత్తానికి పాత పూరిని గుర్తుకుతెస్తాడట.
ఇక ఈ చిత్రాన్ని జూలై 18న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఇక మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు ఇప్పటికే బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్ లో కనపింబోతున్నారు. రాజ్ తోట ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.