హీరోయిన్ పెళ్లి ఇప్పట్లో లేదట !

Published on Mar 6, 2021 6:41 pm IST

హీరోయిన్ మెహరీన్ పెళ్లి కాంగ్రెస్ నేత భవ్య బిష్ణోయ్ తో జరగనుందని, ఇరు కుటుంబాలు ఇప్పటికే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారని.. రీసెంట్ గా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మెహరీన్ ది ఆరేంజ్జ్ మ్యారేజ్ అని, వరుడు అయిన భవ్య బిష్ణోయ్… హర్యానాకి చెందిన యువ రాజకీయనాయకుడు అని, అతని తండ్రి సీనియర్ కాంగ్రెస్ ఎంపీ అని రూమర్స్ వినిపించాయి. అయితే ఈ వార్తలు ఇప్పటికే రకరకాలుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం మెహరీన్ కి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదట. తన పెళ్లి పై వస్తోన్న వార్తలన్నీ అవాస్తవం అని కూడా మెహ్రీన్ చెప్పుకొస్తోంది. కాగా మెహ్రీన్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాల్లో “F3” ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూట్ లో ఆమె ఫుల్ బిజీగా ఉంది. మరి ఈ చిత్రంతో ఈ బ్యూటీ టాలీవుడ్ లో మళ్ళీ ఎంతవరకు నిలబడగలుగుతుందో చూడాలి. ఈ సినిమా పై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :