ఐటెం గర్ల్ టాలెంట్ గుర్తించిన మంచు లక్ష్మి

ఐటెం గర్ల్ టాలెంట్ గుర్తించిన మంచు లక్ష్మి

Published on Aug 11, 2014 10:27 PM IST

Lakshmi-Manchu--New-Photos-

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. అంటూ యావత్ తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన ఐటెం భామ ముమైత్ ఖాన్. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ ప్రేక్షకులను తన వంపు సొంపులతో.. హాట్ అందాలతో ఐటెం సాంగులలో నటించి దుమ్ము రేపింది. కొత్త భామలు ఎంటర్ అవ్వడంతో ముమైత్ కు ఐటెం గర్ల్ అవకాశాలు తగ్గాయి. అందుకే కొత్తగా పాప్ సింగర్ అవతారం ఎత్తింది. తొలి ప్రయత్నంగా ‘ఎడిక్షన్’ పేరుతో సింగిల్ సాంగ్ రిలీజ్ చేసింది.

ఇండో అమెరికన్ స్లాంగ్ లో ముమైత్ ఖాన్ పాడిన ఈ ‘ఎడిక్షన్’ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది. పాత రోజులను గుర్తు తెస్తూ బికినీ, నైట్ వేర్ డ్రెస్సులలో ముమైత్ డాన్సు చేసింది. ఈ పాట చూసిన మంచు లక్ష్మి ముమైత్ ఖాన్ పై ప్రసంశలు కురిపించింది. ‘నీ పాట ప్రపంచం నలుమూలలు చేరుతుందని ఆశిస్తున్నాను. ఆసమ్ సాంగ్. గ్రేట్ వాయిస్’ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు మంచు లక్ష్మి. ఈ పాటతో తనకు తిరిగి అవకాశాలు వస్తాయని మాజీ ఐటెం భామ ఆశిస్తుంది. తన కోరిక నెరవేరాలని కోరుకుందాం.
Manchu_Lakshmi

తాజా వార్తలు