ఏప్రిల్ 16 న విడుదల కానున్న ఇట్లు అంజ‌లి

Published on Apr 11, 2021 10:00 am IST

శ్రీకృష్ణ వొట్టూరు స‌మ‌ర్ప‌ణ‌లో ఓమా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై శ్రీ కార్తికేయ‌, హిమాన్సీ, శుభాంగి పంత్ హీరో హీరోయిన్లుగా న‌వీన్ మ‌న్నేల స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న చిత్రం `ఇట్లు అంజ‌లి`. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న రిలీజ్ అవుతుంది

ద‌ర్శ‌క నిర్మాత న‌వీన్ మ‌న్నేల మాట్లాడుతూ…` ప్రేమ‌లేఖ ఆధారంగా సాగే ఇదొక డిఫ‌రెంట్ రొమాంటిక్ కామెడీ థ్రిల్ల‌ర్ చిత్రం. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన థ్రిల్ల‌ర్స్ సినిమాల్లో క‌న్నా చాలా విభిన్నంగా ఉంటుంది. టీమ్ అంతా క‌ష్ట‌ప‌డి సినిమా చేసాం. మా క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం ద‌క్కుతుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాం. ఇందులో చాలా రిస్కీ షాట్స్ ఉన్నాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమా అవుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 16 న రిలీజ్ చేస్తున్నాము అన్నారు.

సంబంధిత సమాచారం :