యంగ్ హీరో అనీష్, టాలెంటెడ్ బ్యూటీ అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న తాజా యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇట్లు అర్జున’. వెంకీ కుడుముల సమర్పణలో వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేష్ ఉప్పాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వచ్ఛమైన ప్రేమకథతో పాటు హీరో పాత్రలోని ఇంటెన్సిటీ ఈ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. టీజర్‌లో హీరో అనీష్ యాక్షన్ మోడ్‌లో అదరగొట్టగా, హీరోయిన్ అనస్వర రాజన్‌తో వచ్చే సీన్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సంగీత దర్శకుడు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కి మెయిన్ హైలైట్‌గా నిలిచింది.
నిర్మాణ విలువలు ఎంతో రిచ్ గా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 30న రిలీజ్ కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


