మైత్రి, ప్రైమ్ షో సహకారంతో ‘ఇట్లు మీ ఎదవ’ గ్రాండ్ రిలీజ్ – నవంబర్ 21న విడుదల

Itlu-Mee-Edhava

యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘ఇట్లు మీ ఎదవ’ చిత్రం నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. త్రినాధ్ కఠారి హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బళ్లారి శంకర్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే మంచి స్పందనను అందుకోవడంతో, సినిమాపై అంచనాలు పెరిగాయి.

చిత్రాన్ని నైజాం ప్రాంతంలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP విడుదల చేస్తుండగా, ఆంధ్ర, సీడెడ్ ప్రాంతాల్లో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేయనుంది. ఈ రెండు ప్రముఖ సంస్థల ద్వారా సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

సాహితీ అవాంచ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. దీనికి ట్యాగ్ లైన్ ‘వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు’ అని పెట్టారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించగా, జగదీష్ చీకటి డీఓపీగా, ఉద్ధవ్ ఎస్.బి. ఎడిటర్‌గా పనిచేశారు.

Exit mobile version